Beauty TipsHealth

Black Neck : మెడ నల్లగా ఉందా.. ఇలా చేయండి..

Neck black tips :మిగతా శరీర బాగాలు ఎలా ఉన్న కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. నగలు వేసుకొనేటప్పుడు,లో నేక్ దుస్తులు వేసుకొనే టప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇంటిలో మనకు సులభంగా అందుబాటులో ఉండే కొన్ని పదార్దాలతో చెక్ పెట్టవచ్చు.

బాదంలో లభించే విటమిన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మెడ చుట్టూ నలుపును తగ్గించుకోవటానికి అరస్పూన్ బాదం పొడిలో ఒక స్పూన్ పాల పొడి,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి మెడకు రాసుకొని మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద చర్మానికి తేమను అందించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు కలబంద గుజ్జును మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిముషాలు మృదువుగా మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."