Healthhealth tips in telugu

ఈ కూరను ఇలా తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తంను క్లీన్ చేస్తుంది

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెకు సంబందించిన సమస్యలు వస్తూ ఉంటాయి. మన ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ ని తగ్గించే కొన్ని కూరలు గురించి తెలుసుకుందాం. ఈ కూరలు మనం రెగ్యులర్ గా వాడుకొనేవే.

కూరల్లో రారాజు అయిన వంకాయ కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. వంకాయలో ఫైబర్ మరియు సపోనిన్స్ అనే బయో యాక్టివ్ సమ్మేళనం ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. వారంలో రెండు సార్లు వంకాయ వేపుడు కాకుండా కూరగా తింటే మంచిది.

బీన్స్‌ ను వారంలో రెండు సార్లు తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు మొత్తం కరిపోతుంది. వీటిలో కాపర్ తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.అలాగే విటమిన్ ఇ, కేలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. అలాగే డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.