పైసా ఖర్చు లేకుండా ఒక్క రోజులోనే పైల్స్ సమస్య మాయం..ఇది నిజం
Gaddi Chamanthi piles home remedies : మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉంటే విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే కూర్చోలేరు…నిద్రపోలేరు…ఏ పని చేయాలన్నా చికాకుగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించటానికి ఆయుర్వేదంలో ఒక ఆకును ఉపయోగిస్తారు. ఈ ఆకు మన ఇంటి చుట్టుపక్కల చాలా వందల సంఖ్యలో కనపడుతూ ఉంటుంది. ఆ మొక్క గడ్డి చామంతి.

ఈ మొక్కను మనలో చాలా మంది చూసినా ఏదో పిచ్చిమొక్కగా భావిస్తారు. ఈ మొక్క పైల్స్ సమస్యను తగ్గించటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. గడ్డి చామంతి ఆకులను గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడిగి తడి పోయెవరకు ఆరబెట్టాలి. ఈ ఆకులు,పది మిరియాలు కలిపి మెత్తగా చేసుకొని చిన్న చిన్న గోలీలుగా చేసుకోవాలి.
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గోలీ నోట్లో వేసుకొని మింగిన తర్వాత పటికబెల్లం కలిపిన పల్చని మజ్జిగ తాగాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే పైల్స్ సమస్య తగ్గుతుంది. పైల్స్ సమస్య తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు తక్కువ రోజులు అనేది ఉంటుంది. గడ్డి చామంతి కూడా చాలా సులభంగానే దొరుకుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

