MoviesTollywood news in telugu

Snehamante Idera:“స్నేహమంటే ఇదేరా” సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు

Snehamante Idera Movie:తెలుగులో ప్రముఖ దర్శకుడు బాలశేఖరన్ దర్శకత్వంలో వచ్చినటువంటి “స్నేహమంటే ఇదేరా” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోలుగా అక్కినేని నాగార్జున, అక్కినేని సుమంత్ నటించగా హీరోయిన్లుగా భూమిక చావ్లా, స్వర్గీయ ప్రత్యూష, నటించారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించింది.అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో సుమంత్ ఈ విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా తాను మరియు తన చినమామ నాగార్జున కలిసి నటించినటువంటి “స్నేహమంటే ఇదేరా” చిత్రం ఫెయిల్యూర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.అలాగే ఈ చిత్రానికి తాను మరియు నాగార్జున స్నేహితులు అనే అంశం పెద్ద మైనస్ గా ఉందని, అంతే కాక ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేక పోయారని అందువల్ల ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా పరాజయం పాలైందని తెలిపాడు.

అయితే ఇలా జరగడం తనకు రెండవసారి అని మొదట్లో తాను మరియు తన తాతయ్య స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన టువంటి పెళ్లి సంబంధం అనే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైందని చెప్పుకొచ్చాడు.అంతేగాక ఈ రెండు చిత్రాల కథల విషయంలో కూడా కొంత పట్టు లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయని తెలిపాడు.