Kitchenvantalu

Crispy Dosa :దోశ క్రిస్పీగా హోటల్‌ దోశల్లా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Dosa Making Tips :ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మనలో చాలామంది దోశలు తింటూ ఉంటారు. దోశ చాలా రుచిగా ఉంటాయి. అయితే కొంతమందికి దోశలు బాగా రావు. కొన్ని చిట్కాలను పాటిస్తే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి.మార్కెట్లో ఇన్స్టెంట్ దోశ పిండి లభ్యం అవుతుంది. అయితే ఇంటిలో తయారు చేసుకున్న దోశ పిండి అయితే చాలా బాగుంటుంది.

ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యం, ఒక కప్పు మినప్పప్పు, అర స్పూన్ మెంతులు వేసి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టి మిక్సీ చేయాలి. ఇలా మిక్సీ చేసిన పిండిని ఆరు గంటల పాటు మూత పెట్టి పులియపెట్టాలి. అప్పుడే దోస పర్ఫెక్ట్ గా వస్తుంది. Dosa వేయటానికి ఇనుప తవా లేదా పెనం ఉపయోగించాలి.

సగం ఉల్లిపాయను తీసుకొని నూనెలో ముంచి తవా మొత్తం రుద్దండి. దానిపై నీరు చల్లండి. గుడ్డతో తుడిచి దోశలు వేస్తె బాగా వస్తాయి. దోశ క్రిస్పియర్‌గా రావాలంటే కొంచెం బొంబాయి రవ్వ కలపాలి. పైన చెప్పిన కొలతలతో పిండి తయారుచేసుకుంటే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ సరిపోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."