Kitchenvantalu

Dondakaya pickle:ఫంక్షన్లలో చేసే రుచికరమైన దొండకాయ ఆవకాయ పక్కా కొలతలతో..

Dondakaya pickle Recipe:దొండకాయ నిలువ పచ్చడి.. ఎన్ని కూరలు చేసుకున్న అంచుకి రోటి పచ్చడి ఉంటే ఆ టేస్టే వేరు. దొండకాయలతో నిలువ పచ్చడి చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ½ kg
వెల్లుల్లి రెబ్బలు – 15-20
మిరయాల పొడి – 5 టీ స్పూన్స్
ఉప్పు – 4 టీ స్పూన్స్
ఆవాల పొడి – 3 టీ స్పూన్స్
జీలకర్ర మెంతుల పొడి – 1 ½ టీ స్పూన్
చింతపండు పేస్ట్ – 50-60 గ్రాములు
ఎండుమిర్చి విత్తనాలు – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
బెంగాల్ గ్రాము – 2 టీ స్పూన్

తయారీ విధానం
1.దొండకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోని ముక్కలను నిలువుగా కట్ చేసుకోవాలి.
2.కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు,కారం,ఉప్పు,ఆవాల పొడి,జీలకర్ర ,మెంతుల పొడి,చింతపండు రసం,లేదా నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేడి చేసి అందలోకి ఆవాలు,జీలకర్ర ,శనగపప్పు,ఎండుమిర్చి వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
4.స్టవ్ ఆఫ్ చేసి తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలనువేసి కలుపుకోవాలి.
6.మిక్స్ చేసుకున్న దొండకాయ పచ్చడిని తడి లేని గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోని రెండు రోజులు ఊరనివ్వాలి.
7.రెండు రోజుల తర్వాత రుచికి సరిపడా ఉప్పును మిక్స్ చేసుకోవాలి.
8.అంతే కమ్మటి దొండకాయ నిలువ పచ్చడి రెడీ.