Kitchenvantalu

Veg Badam Soup:పోషకాలు నిండిన మిక్స్ వెజ్ బాదాం సూప్.. ఒక సారి ట్రై చేయండి

Mix Veg Badam Soup Recipe: బలాన్ని ఇచ్చి బాదం అంటే, అందరికి ఇష్టమే. ఏ వంటలో అయినా కాసింత బాదాం పొడి కలిసిందంటే, టేస్ట్ డబుల్ అయిపోవాల్సిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, మిక్స్ వెజ్ బాదాం పులుసు, ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు
బాదాం – 15
క్యారేట్ – 1/3 కప్పు
బీన్స్ – 1/3 కప్పు
స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్స్
బఠానీ – 2 టేబుల్ స్పూన్స్
నూనె – ½ టీ స్పూన్
బటర్ – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – 1 టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్
నీళ్లు – 400ML

తయారీ విధానం
1.మరుగుతున్న నీళ్లలో బాదాం వేసి 10 నిముషాలు ఉడికిస్తే, పొట్టు ఊడిపోతుంది.
2. పొట్టు తీసుకున్న బాదాంను మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టండి.
3. ఇప్పుడు వేరొక గిన్నెలో నీళ్లు మరిగించి,అందులో పంచదార, క్యారేట్ బీన్స్, బఠాని, స్వీట్ కార్న్, వేసుకుని, మూడు నిముషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయండి.
4. ఉడికించిన ముక్కలను వడకట్టి, మిక్సీ జార్ లో వేసుకుని, గ్రైండ్ చేసుకోవాలి.

5. ఇప్పుడు సూప్ కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని, నూనె బటర్ కరిగించి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి, వేపుకోవాలి.
6. వేగిన వెల్లుల్లిలో బరకగా గ్రైండ్ చేసుకున్న వెజి టేబుల్ పేస్ట్ వేసి, మరో 3 నిముషాలు వేపుకోవాలి.
7. వెజి టేబుల్స్ వేగాక, నీళ్లు పోసి, మరిగించుకుని, పైన నురగను తీసివేయాలి.
8. ఇప్పుడు అందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టిన, బాదాం పేస్ట్ ఉప్పు, మిరియాల పొడి వేసి , మూడు నుంచి నాలుగు నిముషాలు చిక్కపడనివ్వాలి.
9. అంతే , చిక్కపడిన సూప్ ను వేడి వేడి గా సెర్వ్ చేసుకుంటే, బాదాం సూప్ టేస్ట్ అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News