Kitchenvantalu

Paneer Payasam:ఇంట్లో చేసిన పనీర్ తో కొంచెం కొత్తగా చాలా టేస్టీగా పనీర్ పాయసం

Paneer Payasam Recipe: పాయసం అనగానే, రవ్వతోనో, సేమియా తోనో, లేక గోధుమ పిండితోనో చేసేస్తాం. కాని ఈసారి పన్నీర్ తో ట్రై చేద్దాం. చిటికెలో అయిపోతుంది. రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
పన్నీర్ – 200 గ్రాములు
పాలు – 750ML
పంచదార – 1/4కప్పు
యాలకుల పొడి – 1/2టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – 3 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై శుభ్రంగా ఉన్న, బాండీ పెట్టుకుని, చిక్కని పాలు పోసి , కలుపుతూ మరిగించుకోవాలి.
2. మరిగిన పాలల్లోకి, పంచదార వేసి మరికాసేపు మరిగించాలి.

3. పాలు చిక్కపడిన తర్వాత, వేడి నీళ్లలో నానపెట్టిన, తురిమిన పన్నీర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి,10 నిముషాలు మరగనివ్వాలి.
4. మరిగిన పన్నీర్ పాయసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, చల్లగా, లేదా వేడగా సెర్వ్ చేసుకుంటే, పన్నీర్ పాయసం రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News