Kitchenvantalu

Tomato Kaju Masala Curry:రైస్, బిర్యానీ, రోటీలోకి రెస్టారెంట్ రుచితో కాజు టమాటా కర్రీ

Andhra Style Tomato Kaju Masala Curry Recipe: కర్రీస్ లో గ్రేవీ కోసం మిక్సింగ్ కోసం, వాడే టమాటాలను లైట్ కర్రీస్ లిస్ట్ లో వేస్తుంటారు. కాని, కాసింత మసాలా జోడించి వండారంటే, గరంగా గరంగా నషాలానికి అంటిస్తుంది. ఫంక్షన్స్ సమయంలో కాజుతో టమాట మసాలా కర్రీ చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1/2టీస్పూన్
ఉల్లిపాయ -2
కరివేపాకు – 2 రెబ్బలు
ఎండుమిర్చి -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 1/2కప్పు
టమాటో పేస్ట్ – 3
పసుపు – 1/4టీస్పూన్
గరం మసాలా – 1/4టీస్పూన్
జీలకర్రపొడి – 1/2టీస్పూన్
ఉప్పు – తగినంత
ధనియాల పొడి – 1/2టీస్పూన్
కారం – 1 టీస్పూన్
జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నెయ్యి – 1 టీ స్పూన్
నీళ్లు – 250ML

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, ముందుగా నూనె వేసి, నూనె వెడెక్కిన తర్వాత, జీలకర్ర, ఉల్లిపాయలు,కరివేపాకు, ఎండు మిర్చి వేసుకుని, వేపుకోవాలి.
2.ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత జీడి పప్పు వేసి, ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కలుపుకుని,గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, వేసుకుని, నూనె పైకి తేలే వరకు ఫ్రై చేయాలి.
4.ఇప్పుడు మసాలాలు వేగిన తర్వాత, టమాటో ప్యూరీ తిసి, మీడియం ఫ్లేమ్ పై ఉడికించాలి.

5. ప్యూరీ ఉడికిన తర్వాత, టమాటో పెద్ద తరుగు ముక్కలు వేసి, మెత్తబడే దాకా ఉడికించాలి.
6. ఇప్పుడు అందులోకి , జీడిపప్పు పేస్ట్ వేసి, వేపుకోవాలి.
7. జీడిపప్పు వేగిన తర్వాత నీళ్లు పోసి, బాగా కలుపుకుని, మీడియం ఫ్లేమ్ పై నూనె పైక తేలే వరకు ఉడికించుకోవాలి.
8. చివరగా నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9. అంతే, టమాటో కాజు మాసాల కర్రీ రెడీ అయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News