Kitchenvantalu

Kitchen Hacks:మాడిపోయిన గిన్నెలను ఈ చిన్న చిట్కాతో 10 నిమిషాల్లో సులభంగా శుభ్రం చేయవచ్చు

How to clean burnt vessels easily : మనం వంటింటిలో పని చేసినప్పుడు కొన్ని చిట్కాలను ఫాలో అయితే పనిలో చాలా సమయం ఆదా అవుతుంది. ఒక్కోసారి అనుకోకుండా వంట చేసినప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. అలా మాడిన గిన్నెలను చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

మనం వంటింట్లో ప్రతి రోజు వంట చేసే సమయంలో గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. స్టీల్ గిన్నెలను ప్రతిరోజు వాడటం వలన మెరుపు తగ్గిపోయి నల్లగా మారుతూ ఉంటాయి. ఇలా నల్లగా మారిన మరియు మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు సహాయపడతాయి.

పూర్వం అల్యూమినియం పాత్రలు, మట్టి కుండల్లో వంటలను చేసేవారు. కానీ ప్రస్తుతం స్టీలు పాత్రలలో వంటలను ఎక్కువగా చేస్తున్నారు. గిన్నెలో బాగా నల్ల బడిన లేదా మాడిన భాగంపై కాస్త నిమ్మరసం వేసి రుద్ది… కొంచెం సేపయ్యాక శుభ్రం చేయాలి. నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మొండి మరకలు, జిడ్డు, నూనె మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.

మొండి మరకలను, జిడ్డును తొలగించడానికి బేకింగ్ సోడా కూడా బాగా సహాయపడుతుంది. నల్లగా మరియు మాడిన గిన్నెలో నీటిని పోసి కొంచెం బేకింగ్ సోడా వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నీరు కాస్త వేడి తగ్గాక రుద్దితే జిడ్డు, మురికి, నలుపు అన్ని తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News