Healthhealth tips in teluguvantalu

Weight Loss:1 గ్లాసు స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్

cinnamon and cumin seeds weight Loss Tips in telugu :ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో అధిక బరువు సమస్యను ప్రధానంగా చెప్పుకోవాలి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, వ్యాయామం సరిగా చేయకపోవటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండిపోవటం వంటి కారణాలతో అధిక బరువు సమస్య అనేది వస్తుంది.

బరువు పెరగటం అయితే త్వరగా జరిగిపోతుంది. అదే బరువు తగ్గాలంటే చాలా కష్టం. అధిక బరువు తగ్గించుకోవటానికి, శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మార్కెట్ లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. కానీ వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
jeelakarra Health Benefits in telugu
కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా అధిక బరువు, శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని కోసం జీలకర్ర, దాల్చినచెక్క, తేనె, నిమ్మరసం ఉపయోగిస్తున్నాం.
lemon benefits
దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కాక అరస్పూన్ జీలకర్ర, అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూన్ దాల్చినచెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.
Honey
ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు తాగాలి. ఉదయం తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. ఉదయం పరగడుపున తాగితే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
Weight Loss tips in telugu
జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దాల్చినచెక్క జీర్ణప్రక్రియ బాగా జరగటానికి అవసరమైన జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.