Healthhealth tips in telugu

Fake Black Pepper: మీరు వాడుతున్న నల్ల మిరియాలు మంచివో, నకిలీవో…ఇలా తెలుసుకోండి

Fake Black Pepper: ఈ మధ్య కాలంలో మన వాడే చాలా ఆహార పదార్ధాలు కల్తీ జరుగుతున్నాయి. నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలును చేస్తాయి. ఇవి నిజమైనవో, నకిలీవో తెలుసుకోవాలంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది.

నల్ల మిరియాలను గట్టిగా నొక్కితే విరిగిపోతే అవి నకిలీ అని గుర్తించాలి. అవి మంచివి అయితే గట్టిగా ఉంటాయి. ఘాటైన వాసనతో ముదురు బ్రౌన్ రంగు నుంచి నలుపు రంగులో ఉండేవి మంచివని గుర్తించాలి.

ఎక్కువ ముడతలు ఉంటే అవి మంచి మిరియాలు కావు. నల్ల మిరియాలను ఆహారంలో బాగంగా చేసుకుంటే జీర్ణ ఎంజైమ్ లు అధికంగా ఉత్పత్తి అయ్యి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.

మిరియాలలో మాంగనీస్, విటమిన్ కె, ఐరన్, డైటరీ ఫైబర్, పైపెరిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. అలాగే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.