Kitchenvantalu

Electrical Switches:మురికి పట్టిన స్విచ్ బోర్డు ని ఇలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు

Tips to Clean Switch Board in telugu:ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకొనేటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే పని సులభం అవుతుంది. ప్రతి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు మనం ఎన్నోసార్లు స్విచ్ బోర్డుని ఉపయోగిస్తాం.

టీవీ లేదా ఫ్యాన్ లేదా బల్బు లేదా ట్యూబ్ లైట్ ఇలా వేటిని ఆన్ చేయాలన్న స్విచ్ బోర్డుని ఉపయోగించాలి. దాంతో స్విచ్ బోర్డు చాలా తొందరగా మురికిగా మారుతుంది. ఈ మురికిని శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

స్విచ్ బోర్డు శుభ్రం చేయడానికి ముందు విద్యుత్తును డిస్ కనెక్ట్ చేయాలి. అలాగే చేతులకు గ్లౌజులు కాళ్లకు చెప్పులు ధరించాలి. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల వెనిగర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ క్లాత్ ముంచి బాగా పిండి స్విచ్ బోర్డును శుభ్రం చేయాలి.

ఒక బౌల్ లో మూడు టీ స్పూన్ల బేకింగ్ సోడాలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్విచ్ బోర్డు మీద అప్లై చేసి పొడి క్లాత్ తో తుడిచి బోర్డులు శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన నిమిషాల్లో మురికిని తొలగించి బోర్డు కొత్తదానిలా మెరుస్తుంది. స్విచ్ బోర్డు శుభ్రం చేసిన వెంటనే పవర్ ఆన్ చేయ కూడదు. స్విచ్ బోర్డ్ శుభ్రం చేసిన అరగంట తర్వాత మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News