Kitchenvantalu

Kitchen Tips:ఇప్పటి వరకు ఎవరూ చెప్పని వంటింటి చిట్కాలు మీ కోసమే…

Telugu Useful Kitchen Tips:ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వలన కడుపు నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది. అలా కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.   జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడు పునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్  ఫెక్షన్  బాధ నుంచి బయట పడవచ్చు.

అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గును చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.

కోడిగుడ్లు పెంకును జాగ్రత్తగా పరిశీలిస్తే గుడ్డు తాజాగా ఉందా లేదా అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.  కోడి గుడ్డు పెంకు మంచి షైనింగ్ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.