Healthhealth tips in teluguKitchenvantalu

Black Salt: సాధారణ ఉప్పు బదులు.. బ్లాక్‌ సాల్ట్‌ వాడుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే…

Black Salt Benefits in telugu :ఉప్పులలో ఎన్నో రకాలు లభ్యం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో రకరకాల ఉప్పులను వాడటానికి ఇష్టపడుతున్నారు. అలాంటి ఉప్పులలో ఒకటైన బ్లాక్ సాల్ట్ గురించి తెలుసుకుందాం.

మనం సాదారణంగా తెల్ల ఉప్పు వాడుతూ ఉంటాం… లేదంటే సైందవ లవణం… లేదంటే కళ్ళు ఉప్పు వాడుతూ ఉంటాం. అలా కాకుండా నల్ల ఉప్పును వాడితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటూ… మంచి రుచిని కూడా ఇస్తుంది.

నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడటం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

పొటాషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల నొప్పులను తగ్గించడంలో మరియు కండరాలు సరిగా పనిచేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించటానికి మరియు రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు నల్ల ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు, గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. సైనస్ సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవిరి పెట్టుకున్నప్పుడు నల్ల ఉప్పును వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలించడం ద్వారా కఫం కరగటమే కాకుండా నాసికా రంధ్రాలు ఫ్రీ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."