Kitchenvantalu

Potato Bread Sandwich:కేవలం 10 నిమిషాల్లో..పిల్లలు స్నాక్ అడిగినప్పుడు బ్రెడ్ తో ఇలా చేసి పెట్టండి

Potato Bread Sandwich:కేవలం 10 నిమిషాల్లో..పిల్లలు స్నాక్ అడిగినప్పుడు బ్రెడ్ తో ఇలా చేసి పెట్టండి..పిల్లలకు వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇడ్లీ,దోస,వడ లాంటి స్పెషల్సే కాకుండ అప్పుడప్పుడు కొత్త కొత్త రెసీపీస్ కూడా ట్రైచేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా కాని,ఈవినింగ్ స్నాక్స్ గా కాని పొటాటో బ్రెడ్ శాండ్విచ్ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ – 5-6
నూనె – 1టేబుల్ స్పన్
చీజ్ తురుము – 4 క్యూబ్స్
బటర్ – 2 టేబుల్ స్పూన్స్
ఉడికించిన బంగాళదుంపలు – 3
ఉల్లిపాయ తరుగు – 2
పచ్చిమిర్చి – 2
ఉడికించిన బఠానీలు – ¼ కప్పు
కొత్తిమీర – ¼ కప్పు
కారం – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
చాట్ మసాలా – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా స్టఫింగ్ కోసం ఉడికించిన బంగాళదుంపలను మాష్ చేసుకోని మిక్సింగ్ బౌల్ వేసుకోవాలి.
2.అందులోకి తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,ఉడికించిన బఠానీలు,కొత్తిమీర,కారం,ఉప్పు,ధనియాలపొడి,జీలకర్రపొడి,పసుపు,చాట్ మసాలను వేసి బాగా కలుపుకోవాలి.
3.ఇప్పుడు బ్రెడ్ ముక్కలను గుడ్రని గిన్నె సాయంతో గుండ్రంగా కట్ చేసుకోవాలి.

4.కట్ చేసుకున్న బ్రెడ్ ను రోల్ పిన్ సాయంతో రోల్ చేసుకోవాలి.
5.రోల్ చేసుకున్న బ్రెడ్ పై స్టఫ్ ను జాగ్రత్తగా ప్లేస్ చేసి దాని పై చీజ్ తురుమును వేసుకోని దానిపై మరో బ్రెడ్ పీస్ ను ఉంచి,స్టఫింగ్ బయటికి రాకుండా అంచులను నొక్కాలి.
6.ఇప్పుడు వేడెక్కిన ప్యాన్ పై ఆయిల్ వేసుకోని శాండ్విచ్ ను రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడి పొటాటో బ్రెడ్ శాండ్వీచ్ రెడీ.