Guppedantha Manasu:గుప్పెడంత మనస్సు సీరియల్ “మను” గురించి ఈ విషయాలు తెలుసా..?
Guppedantha Manasu: గుప్పెడంత మనస్సు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట జగతి పాత్ర.. ఆ తర్వాత రిషి పాత్ర వెళ్ళిపోయింది. రిషి వెళ్ళాక మను పేరుతో ఒక కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతని అసలు పేరు రవిశంకర్ రాథోడ్.
ఇతను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసికి రెండో కొడుకు పాత్రలో నటించాడు. రవిశంకర్ ఆనందరాగం, రావోయి చందమామ వంటి సీరియల్స్‌లో నటించిన పెద్దగా పేరు రాలేదు. జగతి పాత్ర వెళ్ళిపోయాక తల్లి సెంట్ మెంట్ తగ్గింది.
ఇక ఇప్పుడు అనుపమ కొడుకుగా మనుని చూపిస్తూ మదర్ సెంటిమెంట్ ని డైరెక్టర్ వర్కౌట్ చేస్తూ ఆడియన్స్ ని మళ్ళీ తమ వైపు తిప్పుకుని సీరియల్ కి రేటింగ్ పెంచుకునే పనిలో పడ్డారు.
రవి శంకర్.. కేవలం యాక్టరే కాదు డెంటల్ సర్జన్‌గా క్లినిక్ నడుపుతున్నాడు. ఇక రవి శంకర్ ‘హనుమాన్’ మూవీలో హీరో తేజా అక్క పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్‌ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు రోల్ లో నటించాడు. ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తున్నాడు.