Kitchenvantalu

Dabha Style Methi Egg Curry: కోడిగుడ్డు టమోటా మెంతికూర.. కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా!

Dabha Style Methi Egg Curry: కోడిగుడ్డు టమోటా మెంతికూర.. కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా..ఎన్ని స్పెషల్స్ చేసుకున్నా ఎగ్ తో చేసుకునే రెసిపీస్ అంటేనే అందరు ఇష్టపడుతుంటారు. ఎగ్ మసాల కర్రీ లోకి చలువ చేసే మెంతి కూర వేసి చేయండి రుచి అమోఘంగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 4
నూనె – 5 స్పూన్స్
మెంతికూర తరుగు – 4
టమాటో – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
గరంమసాల – ¼ టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 1 ¼ కప్పు
పచ్చిమిర్చి తరుగు – 3
పసుపు – ¼ టీ స్పూన్
కసూరీ మేథీ – 2 టేబుల్ స్పూన్స్
నీళ్లు – 1 కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కొంచెం నూనె పసుపు వేసి..ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టుకోని టాస్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లో మిగిలిన నూనె వేడి చేసి అందులో జీలకర్ర,ఉల్లితరుగు,పచ్చిమిర్చి,ఉప్పు,వేసి ఫ్రై చేసుకోవాలి.
3.వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి.
4.అందులోకి కారం,ధనియాల పొడి,జీలకర్ర పొడి,కొద్దిగా నీళ్లు పోసి మాడకుండ వేపుకోవాలి.

5.మసాలల్లోంచి నూనె పైకి తేలుతున్న సమయంలో మెంతి కూర వేసి పసరు వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి.
6.ఆకు బాగా వేగిన తర్వాత టమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలే వరకు మూతపెట్టి వేపుకోవాలి.
7.తర్వాత వేపుకున్న గుడ్లను వేసి,నీళ్లు పోసి ,కసూరీ మెథీ,గరం మసాల వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పై ఏడు నిమిషాల మరగనివ్వాలి.
8.పులుసు బాగా మరిగి గుడ్డుకు మసాలాలు బాగా పట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోని వేడి వేడి గా సర్వ్ చేసుకోవడమే..
Click Here To Follow Chaipakodi On Google News