Kitchenvantalu

Meal maker Kurma:మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ

Meal maker Kurma:మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ…Meal maker లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వెజిటేరియన్స్ ఎంతో స్పెషల్గా చేసుకునే రెసిపీ మిల్ మేకర్స్. పోషకాలలోను,రుచిలోను నాన్ వెజ్ కి ఏమాత్రం తగ్గని సోయా కుర్మా చపాతి, రోటి,అన్నం ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
మిల్మేకర్ – 1 కప్పు
వేడినీళ్లు – 3 కప్పులు
ఉప్పు – కొద్దిగా
మసాలా పేస్ట్ కోసం..
యాలకులు – 4
లవంగాలు – 4
మిరియాలు – ¼ టేబుల్ స్పూన్స్
దాల్చిన చెక్క – 1 ఇంచ్
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – 5 రెబ్బలు
ఉల్లిపాయ – 2
పచ్చిమిర్చి – 2
కుర్మా కోసం..
నూనె – 5 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టేబుల్ స్పూన్స్
బిర్యాని ఆకు – 1
యాలకులు – 2
లవంగాలు – 2
దాల్చిన చెక్క – 1 ఇంచ్
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
టమాటో పేస్ట్- 1 కప్పు
ఉప్పు- తగినంత
కారం- 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
గరం మసాల – ¼ టేబుల్ స్పూన్
నీళ్లు – 1 1/4 కప్పు
చిలికిన పెరుగు – ½ కప్పు
కొత్తిమీర – కొద్దిగా
కసూరీ మేథీ- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.మిల్మేకర్ లో వేడి నీళ్లు, ఉప్పు వేసి 15 నిమిషాలపాటు నానబెట్టి తర్వాత నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి.
2.మిక్సి జార్ లోకి మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలను వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడిచేసి అందులోకి మిల్మేకర్స్ కొద్దిగా పసుపు వేసి నిమిషం పాటు వేపుకోని పక్కన పెట్టుకోండి.
4.అదే ప్యాన్ లోకి నూనే వేసి అందులో యాలకులు,లవంగాలు,బిర్యాని ఆకు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేపుకోవాలి.

5.వేగిన మసాలాల్లో ఉల్లిపాయ తరుగు,మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి.
6.ఉల్లిలోంచి నూనె పైకి తేలిన తర్వాత టమాటో పేస్ట్ వేసి కాసేపు వేపి,మిగిలిన మసాలలు కొద్దిగా నీళ్లు పోసి వేపుకోవాలి.
7.వేగిన మసాలాల్లో మిల్ మేకర్ వేసి కలుపుకోని నీళ్లు పోసి 7-8 నిమిషాలు ఉడకించాలి.
8.మూత తీసి ఉడికిన మిల్మేకర్ లోకి చిలికిన పెరుగు వేసి కలుపుకోని మరో 5 నిమిషాలు ఉడికించండి.
9.చివరగా కొత్తిమీర తరుగు,కసూరీ మేథీ వేసి కలిపి నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుమఘుమలాడే సోయా మసాలా కుర్మా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News