Beauty TipsKitchenvantalu

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి…ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది. దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి లో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి.

ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా,ఆరోగ్యంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. తలకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది.

దాల్చిన చెక్కలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు చుండ్రు,తలలో దురదను తగిస్తుంది. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తల మీద చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది జుట్టును సెల్ డ్యామేజ్ నుంచి రక్షించి జుట్టుకు పోషణ అందిస్తుంది.

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారూ పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.