Kitchenvantalu

Gongura pulusu recipe: పాతకాల పద్ధతిలో గోంగూర పులుసు.. అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది..!

Gongura pulusu recipe పాతకాల పద్ధతిలో గోంగూర పులుసు.. అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది..ప్రతి తెలుగు ఇంటి వంటకాల్లో, గోంగూర పచ్చడిది ప్రత్యేక స్థానం. గోంగూర పచ్చడి లేని పెళ్లి ఉండదు. రుచికి తిరుగు ఉండదు. పచ్చడి సంగతి పక్కకు పెడితే, గోంగూర పులుసు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.

కావాల్సన పదార్ధాలు
గోంగూర ఆకలు – 250 గ్రాములు
పచ్చి శనగపప్పు – 1/4 కప్పు
పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు – 10
పచ్చిమర్చి – 5
పసుపు – చిటికెడు
శనగపిండి – 2 టీ స్పూన్లు
బెల్లం – 1.5 టేబుల్ స్పూన్స్
చింతపండు పేస్ట్ -300 ml
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతుపు – 1 టీ స్పూన్
ఎండుమిరపకాయలు -7
ఇంగువ – చిటికెడు
నూనె – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ఒక పాన్ లోకి గోంగూరను వేసుకుని, నీళ్లు వేసి,అందులోకి శనగపప్పు,పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు వేసుకుని,మూత పెట్టి ఉడికించుకోవాలి.
2. ఇప్పుడు వేరొక పాన్ లో ఆయిల్ వేసుకుని, అది వెడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, వేసుకుని, రంగు వచ్చేవరకు వేయించుకోవాలి
3.ఇప్పుడు అందులోకి ఎండుమిరపకాయలు, ఇంగువ యాడ్ చేయాలి
4. వేగిన ఈ పదార్దాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

5. ఇఫ్పుడు గోంగూర ఉడికిన తర్వాత , అందులోకి చింతపండు రసం, తయారు చేసి పెట్టుకున్న మెంతిపొడి, ఉప్పు వేసుకుని , ఒక ఐదు నిముషాలు ఉడికించాలి
6. ఇప్పుడు , కొద్దిగా శనగపిండిన తీసుకుని, అందులోకి వాటర్ వేసి, ఉండలు లేకుండా పల్చగా తయారు చేసి, ఉడికిన కూరలోకి యాడ్ చేయాలి.
7. చివరగా బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News