Kitchenvantalu

Butter Paneer Masala: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో బటర్ పన్నీర్ మసాల తయారీ విధానం

Butter Paneer Masala: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో బటర్ పన్నీర్ మసాల తయారీ విధానం..వెజ్ ప్రియులకు టేస్టీగా,హెల్తీగా,స్పైసీగా నాన్ వెజ్ తో సమానమైన పోషక విలువలుండే రెసిపీ పన్నీర్. ఆంధ్రా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా పర్ ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పనీర్ కోసం..
బటర్ లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
పనీర్ – 200 గ్రాములు
పసుపు – 1 చిటికెడు

గ్రేవీ కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 15
కర్భూజ గింజలు – 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి ముక్కలు – కొద్దిగా
దాల్చిన చెక్క- 1 ఇంచ్
లవంగాలు – 3
యాలకులు – 2
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
గసగసాలు – 1 టేబుల్ స్పూన్
టమాటో – 2
కూర కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బటర్ లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – 1 ½ టేబుల్ స్పూన్
నీళ్లు – 275 ml
రెడ్ ఫుడ్ కలర్ – 2 చిటికెలు
కసూరి మేథీ – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బటర్ కరిగించి చిటికెడు పసుపు వేసి పనీర్ ముక్కలను వేపుకోవాలి.
2.ఇప్పుడు వేరొక ప్యాన్ లో నూనె వేడి చేసి అందులోకి జీడిపప్పు,కర్భూజ గింజలు,దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు వేసి వేపుకోవాలి.
3.తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.అందులోకి గసగసాలు కూడ వేసి వేగనివ్వాలి.
4.అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

5.కర్రీ కోసం కడాయిలో నూనె లేదా బటర్ వేసి అందులో జీలకర్ర ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకోవాలి.
6.అందులోకి ఉప్పు,ధనియాల పొడి,కారం ,జీలకర్ర పొడి వేసి మసాలాలు మాడిపోకుండ కొద్దిగా నీళ్లు వేసి వేపుకోవాలి.
7.నూనె పైకి తేలుతున్న సమయంలో చేసుకున్న గ్రేవీ పేస్ట్ నీళ్లు పోసి నూనే పైకి తేలే వరకు కలుపుతు దగ్గర పడనివ్వాలి.
8.అందులోకి పనీర్ ముక్కలు,నలిపిన కసూరీ మేథీ వేసి మిగిలిన బటర్ వేసి నెమ్మదిగా కలుపుకోని రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.