Healthhealth tips in telugu

Bad cholesterol:చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోయిందా? ఇలా తగ్గించుకోండి..!-

Bad Cholesterol:మారిన పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు కారణం అవుతుంది.

ఈ సమస్య డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి రోజు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో అంగుళం అల్లం ముక్కను దంచి వేయాలి. ఆ తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి దంచి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని గ్లాస్ లోకి వడకట్టి కొంచెం చల్లారాక ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. నిమ్మరసంలో విటమిన్ సి,సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో కణాల పునరుత్పత్తికి కూడా సహాయ పడుతుంది.

ధమనుల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువును కూడా తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ ని పరగడుపున తీసుకోవచ్చు. లేదా బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు లేదా లంచ్ చేయటానికి అరగంట ముందు తీసుకోవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.