Healthhealth tips in telugu

Joint Pains:కీళ్ల నొప్పులు ఉన్నాయా.. ఇవి అస్సలు తినకూడదు..!

Joint Pains Avoid Foods : కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో కీళ్ళ నొప్పులు అనేవి వయస్సు మళ్ళిన వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

మారిన జీవన విధానం,ఆహార అలవాట్లు చాలా చిన్న వయస్సులోనే కీళ్ళ నొప్పులు రావటానికి దోహదం చేస్తున్నాయి. అయితే వీటి నివారణకు మందులు వాడటం కన్నా కొన్ని రకాల ఆహార పదార్దాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.

మాంసాహారం
కీళ్ళ నొప్పులతో బాధపడేవారు మాంసాహారంనకు దూరంగా ఉంటేనే మంచిది. ముఖ్యంగా జంతువుల లివర్,గుండె,మెదడు వంటివి అసలు తినకూడదు. ఇవి కీళ్ళ నొప్పులను మరింత ఎక్కువగా చేస్తాయి.

చక్కెర
చక్కెర కలిగిన ఆహార పదార్దాలు కూడా కీళ్ళ నొప్పులను పెంచుతాయి. చక్కెర కీళ్లలో వాపు,మంటను మరింత ఎక్కువగా చేస్తుంది. చక్కెర లేని టీ త్రాగటం,చక్కెర పదార్దాలకు దూరంగా ఉండటం ద్వారా కీళ్ళ నొప్పుల నుండి తప్పించుకోవచ్చు.

శాకాహారం
మాంసాహారమే కీళ్ళ నొప్పులకు కారణం కానక్కరలేదు. కొన్ని రకాల కూరగాయలు కూడా కీళ్ళనొప్పులకు కారణం కావచ్చు. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు పాలకూర,కాలీఫ్లవర్,బీన్స్,పుట్టగొడుగులకు దూరంగా ఉండాలి. వీటిని తప్పనిసరిగా తీసుకోవలసిన అవసరం వస్తే మాత్రం చాల తక్కువగా తీసుకోవటం మంచిది.

చేప
వీటిని తీసుకోవటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చాలా మందికి తెలిసినా, వీటిలో అధిక మొత్తంలో ఉండే పురిన్స్ మాత్రం కీళ్ళ నొప్పులను అధికం చేస్తాయని చాలా మందికి తెలియదు. అందువలన కీళ్ళ నొప్పులతో బాధపడేవారు వీటిని అధిక మొత్తంలో తీసుకోవటం మంచిది కాదు.

పాల ఉత్పత్తులు
కీళ్ళ నొప్పులు రావటానికి పాల ఉత్పత్తులు కారణం అవుతాయి. వీటిలోని టాక్సిన్స్ కీళ్ళ నొప్పులు రావటానికి దోహదం చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.