Kitchenvantalu

Aloo Matar Pulao:కూరగాయలు లేనపుడు ఇలా సింపుల్ గా ఆలూతో పులావ్ చేసారంటే..సూపర్ గా ఉంటుంది

Aloo Matar Pulao:కూరగాయలు లేనపుడు ఇలా సింపుల్ గా ఆలూతో పులావ్ చేసారంటే..సూపర్ గా ఉంటుంది..మార్నింగ్ బాక్స్ ప్యాకింగ్ కు ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండాలి. ఎప్పుడూ చేసుకునే క్యారేట్ రైస్, ఎగ్ రైస్ కాకుండా, ఆలు బఠానితో పలావ్ చేసేయండీ.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి బియ్యం – 1 కప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బిరియాని ఆకు – 1
లవంగాలు – 4
యాలకులు – 5
సాజీరా – ½ టీ స్పూన్
దాల్చిన చెక్క – 1 ఇంచ్
నల్ల యాలకులు – 1
ఉల్లిపాయలు – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – 2
ఆలు – 1
బఠానీ – ½ కప్పు
పుదీనా తరుగు – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నీళ్లు – 1 1/4కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకుని, నూనె యాడ్ చేసి వేడెక్కిన తర్వాత, అందులో బిర్యాని ఆకు, లవంగాలు, సాజీరా, నల్ల యాలక వేసి వేగనివ్వాలి.
2. తర్వాత ఉల్లిపాయలు వేసి, కాస్త వేగాక ఆలు ముక్కలు కూడా వేసి, మరి కాసేపు వేపుకోవాలి.
3. ఆలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చిన వాసన పోయేవరకు వేపుకోవాలి.

4. ఇప్పుడు అందులోకి ఎసరు కోసం నీళ్లు పోసి,అందులో పచ్చిమిచ్చి, ఉప్పు, బఠానీ వేసుకుని,హై ఫ్లేమ్ పైన మరగనివ్వాలి.
5. మరుగుతున్న ఎసరు లో గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి బియ్యం, కొత్తిమీర, పుదీనా, వేసి, కుక్కర్ మూత పెట్టి, ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి.
6. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత ఒకసారి కలిపి రైతాతో సెర్వ్ చేసుకుంటే, వేడి వేడి ఆలు బఠాని పలావ్ అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News