Kitchenvantalu

Curd Poha Recipe:పెరుగుతో చేసే పోహా.. వేడి వాతావరణానికి చల్లని అల్పాహారం

Curd Poha Recipe:పెరుగుతో చేసే పోహా.. వేడి వాతావరణానికి చల్లని అల్పాహారం..స్నాక్స్ గా చేసుకునే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచివి. తేలికైన ఆహారంగా అటుకులకు ఎంతో పేరు. ఇక పెరుగు లేనిదే భోజనం ఫుల్ ఫిల్ అవ్వదు. ఈ పెరుగు, అటుకులతో ఆరోగ్యకరమైన, సంప్రదాయ బద్దమైన మహారాష్ట్ర స్పెషల్. పెరుగు పోహ ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మందం అటుకులు – 1 కప్పు
పెరుగు – 1/4కప్పు
నూనె – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
చల్ల మిరపకాయలు – 2
కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం
1.ఇప్పుడొక గిన్నెలోకి కడిగి,ఆరపెట్టిన అటుకులు తీసుకుని,అందులో పెరుగు , ఉప్పు కలపి పక్కన పెట్టుకోవాలి.
2. తాళింపు కోసం, ఒక పాన్ పెట్టి, అందులో నూనె వేసుకుని, అవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసి, తాళింపును అటుకులో కలిపేసుకోవాలి.
3. అంతే బాగా మిక్స్ చేసుకుని వెంటనే తింటే పెరుగు పోహ అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News