Kitchenvantalu

Tomato Dosa: టమోటా దోశ ఇలా చేస్తే వదలకుండా తినేస్తారు

Tomato Dosa: టమోటా దోశ ఇలా చేస్తే వదలకుండా తినేస్తారు..దోశెలంటే ఎంతో మందికి ప్రాణం. కానీ ఎప్పుడూ ఒకేలా వేసుకుని తింటే బోరు కొట్టడం లేదా? అందుకే కాస్త కొత్తగా ప్రయత్నించండి. టమోటాలతో దోశె వేసుకుని చూడండి. పిల్లలు వదలకుండా తినేస్తారు. వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా చేయవచ్చు.

కావలసిన పదార్ధాలు
బియ్యం 250 గ్రాములు
టమాటాలు 3
సెనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్
చింతపండు కొద్దిగా
ఎండు మిరపకాయలు 6
ఉప్పు తగినంత
నువ్వుల నూనె 100 మి.లీ

తయారి విధానం
బియ్యం మరియు శనగపప్పు 2 గంటలు నానపెట్టండి.తరువాత ఉప్పు, ఎండు మిరపకాయలు, టమాటాలు మరియు చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.దోశల పెనం వేడి చేసి, రుబ్బుకున్న మిశ్రమాన్ని అంచులనుంచి మధ్యలోకి వెయ్యండి. కొద్దిగా నూనె తీసుకొని దోశ మీద చల్లి, ఎర్రగా కాలేవరకు ఉంచండి. ఇదేవిధంగా రెండు వైపులా కాల నివ్వాలి.