Kitchenvantalu

Garlic Rice:కేవలం 10 నిమిషాల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రైస్..చాలా సింపుల్ గా చేసేయండి

Garlic Rice:కేవలం 10 నిమిషాల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రైస్..చాలా సింపుల్ గా చేసేయండి.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
సోనామసూరి బియ్యం- 100గ్రా.,ఆవాలు రెండు టీ స్పూన్లు,శనగపప్పు పది గ్రా,పచ్చిమిర్చి- ఆరు,వెల్లుల్లి-100గ్రా (రేకులను విడదీసి హిట్టు ఒలుచుకోవాలి), కరివేపాకు-50గా, నెయ్యి 50గ్రా,నిమ్మచెక్క ఒకటి,ఎండుమిర్చి రెండు,ఉప్పు తగినంత

తయారు చేయు విధానం
అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి.ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."