Kitchenvantalu

Pickles Storage Tips:పచ్చళ్లు పాడవకుండా సంవత్సరమంతా నిల్వ ఉండాలంటే..

Pickles Storage Tips:పచ్చళ్లు పాడవకుండా సంవత్సరమంతా నిల్వ ఉండాలంటే.. ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్లు తేలికగా వారం నుంచి పది రోజులు నిల్వ చేసుకోవచ్చు. దాని కోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

పచ్చళ్లను గాజు సీసాల్లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. మూత సరిగ్గా ఉన్నది చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్లాస్టిక్ సీసాలు, స్టీలు డబ్బాలు సాధ్యమైనంత వరకు వాడకూడదు.

పచ్చడిని నిల్వ చేసే సీసాని ముందుగా చక్కగా శుభ్రం చేయాలి. వేడినీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత తుడిచి మూత పెట్టేయాలి. సీసాలో పచ్చడి వేశాక మూత గట్టిగా పెట్టాలి. అలా కాకుండా తెరిచి పెడితే బూజు పడుతుంది. అలాగే వేడి పచ్చడిని సీసాలో వేసేయొద్దు. చల్లారాక నింపితే ఎక్కువ రోజులు నిల్వ
ఉంటుంది.

సీసాలో పచ్చడి పూర్తిగా పై వరకు నింపొద్దు. కనీసం అంగుళం వరకు ఖాళీగా వదిలేయాలి. మూత కూడా ఏ మాత్రం తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. పచ్చడి పైన ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు నూనె ఉండేలా చూసుకోవాలి. పచ్చడిలో ఉప్పుతోపాటు ఆవ పిండి కలపడం వల్ల కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. వెడల్పాటి గిన్నెలో నీళ్లు మరిగించి అందులో పచ్చడి సీసాని కాసేపుంచి, ఆ తర్వాత తడి తుడిచి పక్కకు పెట్టుకోవాలి.

తియ్యటి పచ్చళ్లకు పంచదార పాకం లేదా బెల్లం పాకాన్ని పచ్చళ్లపై పోయడం వల్ల వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఉడికించిన, వేయించిన పచ్చళ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే సీసాలో పచ్చడి నింపాక పైన మూడు, నాలుగు చెంచాల కాచిన ఆవనూనె పోస్తే మంచిది. ఈ చిట్కాలను పాటిస్తే పచ్చళ్ళు బూజు పట్టకుండా సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.