Kitchenvantalu

Soft Roti:చపాతీలు మెత్తగా, మృదువుగా పొరలు పొరలుగా రావాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి

Soft Roti:చపాతీలు మెత్తగా, మృదువుగా పొరలు పొరలుగా రావాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి..ఈ మధ్య కాలంలో బరువు తగ్గే క్రమంలో చాలా మంది చపాతీ తింటున్నారు. చపాతీ గట్టిగా ఉండటంతో తినటానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే చపాతీలు గట్టిగా కాకుండా మృదువుగా మెత్తగా ఉంటాయి.

చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటే తినటానికి ఇబ్బంది ఉండదు. అయితే మనలో చాలా మందికి చపాతీలు మృదువుగా మెత్తగా రావటం లేదని చపాతీలను తినటం మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మెత్తని మృదువైన చపాతీలను తయారుచేసుకోవచ్చు.

చపాతీలు మెత్తగా ఎన్ని గంటలైన మృదువుగా రుచికరంగా ఉండాలంటే చపాతి పిండి లో కొద్దిగా గోరు వెచ్చని పాలు పోసి పిండి కలిపితే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా చపాతీ అంచులు అన్ని సమానంగా వచ్చి బాగా కాలతాయి.

చపాతీ పిండిలో 60 శాతం నీటిని,40 శాతం పాలను పోసి కలిపితే చపాతీలు చల్లారిన తర్వాత కూడా మెత్తగా,మృదువుగా ఉంటాయి. అలాగే తింటున్నప్పుడు ఎంతో కమ్మగా రుచిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.