Kitchenvantalu

Pesara Garelu : పెసరు పప్పు గారెలు.. రుచిగా ఉంటాయి

Pesara Garelu Recipe : గారెలు తయారు చేసుకోవాలంటే.. ఎక్కువగా మినప పప్పు, బొబ్బెర పప్పును వాడుతుంటాం. అయితే పెసరు పప్పుతోనూ గారెలు తయారు చేసుకోవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు
పెసర పప్పు రెండు వందల గ్రాములు
పచ్చిమిర్చి పది
అల్లం రెండు అంగుళాలు
ఉప్పు తగినంత
నూనె మూడు వందల మిల్లి లీటర్లు

తయారి విధానం
పెసర పప్పును మూడు గంటల పాటు నానబెట్టాలి. పెసలు,పచ్చిమిర్చి,అల్లం మరియు ఉప్పు వేసి మందపాటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్లాస్టిక్ షీట్ ఫై ఉండని పెట్టి వృత్తాకారంలోకి చేయాలి. వృత్తం మధ్యలో కన్నం పెట్టుకోవాలి.మూకుడులో నూనె వేసి వేడి చేసి,వేడి అయ్యాక వడని వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే పెసర గారెలు రెడీ.