Healthhealth tips in telugu

Red Foods:ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోండి.. వీటితో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Health Benefits of Red Foods:ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోండి.. వీటితో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. పండ్లు, కూర గాయలు మనకు ఎన్నో పోషకాలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

అయితే ఈ రోజు ఎరుపు రంగు ఆహారాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఎరుపు రంగులో ఆహారాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఆహారాలలో లైకోపీన్, ఎల్లాజిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్ ఎ మరియు సి వంటి పోషకాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫోలేట్ సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెర్రీలు రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల మధ్య వశ్యతను మరియు బలాన్ని పెంచటానికి సహాయపడుతుంది. ప్రోస్టేట్, సర్వైకల్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంతోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడం మరియు కణితి పెరుగుదలను తగ్గిస్తుంది.

జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటివి ఏమి లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎరుపు రంగు ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.