Healthhealth tips in telugu

Tomato:రాత్రి వేళ పొరపాటున కూడా టమాటా తినవద్దు.. ఎందుకో తెలుసా..

Tomato:రాత్రి వేళ పొరపాటున కూడా టమాటా తినవద్దు.. ఎందుకో తెలుసా..మనలో చాలా మంది టమాటా అంటే ఇష్టపడుతూ ఉంటారు టమాటా కూర లో వేస్తే మంచి రుచి వస్తుంది ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

టమోటాలో విటమిన్ ఎ విటమిన్ సి విటమిన్ కె విటమిన్ బి కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం,సోడియం,జింక్ ఫైబర్,ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయినా సరే రాత్రి సమయంలో టమాటా తినవద్దు అని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే టమాటా లో ఉండే టైరమైన్ అనే అమైనో ఆమ్లం గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట సమస్యలకు కారణం అవుతుంది దాంతో నిద్రాభంగం అవుతుంది.

అలాగే కీరదోస కూడా రాత్రి సమయంలో తీసుకోకూడదు.కీరదోస రాత్రి సమయంలో తీసుకుంటే కీరాలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన తరచు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. అలాగే బ్రోకలీ కాలీఫ్లవర్ క్యాబేజీ వంటివి కూడా రాత్రి సమయంలో తీసుకోవడం వలన వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం ఆలస్యం అయి కడుపు ఉబ్బరం కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.