Healthhealth tips in telugu

Thyroid: మీకు థైరాయిడ్ సమస్య ఉందా.. అయితే ఈ ఆహారం తీసుకోండి..

Thyroid: మీకు థైరాయిడ్ సమస్య ఉందా.. అయితే ఈ ఆహారం తీసుకోండి.. ధైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా? అయితే వీటిని ఫాలో అయ్యిపొండి. శరీరం అనే పెద్ద యంత్రాన్ని ఒక చిన్న గ్రంధి శాసిస్తుంటే నమ్మశక్యం కాకపోవచ్చు.

కానీ నమ్మవలసిందే అని నిపుణులు అంటున్నారు. ఆ గ్రంధి పేరు ధైరాయిడ్. గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో అంటుకొని ఉండే ఈ గ్రంధి ద్వారా స్రవించే హార్మోన్స్ శరీర ఆరోగ్యంలో కీలకపాత్రను పోషిస్తాయి.

శరీరం ఎదుగుదల దగ్గర నుంచి గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతను నిర్ణయించే వరకు అనేక పనులను ఈ గ్రంధి చేస్తుంది.అటువంటి ధైరాయిడ్ సమస్యల నుండి బయట పడాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

1. శారీరక శ్రమ తగ్గిన వారిలో ధైరాయిడ్ హెచ్చు తగ్గులు కనిపించే అవకాశం ఉంది. అందువలన క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

2. యోగా, ప్రాణాయామం వంటివి ధైరాయిడ్ పనితీరును క్రమబద్దికరిస్తుంది.

3. ఎక్కువ కాలం నిల్వ ఉన్న పదార్దాలు,మైదా, చక్కెరతో తయారుచేసిన పదార్దాలను తినటం మానివేయాలి.

4. విటమిన్ ఎ ధైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయటానికి సహాయపడుతుంది. ఇది ఎక్కువగా ఉండే ఆకుకూరలు, గుమ్మడి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

5. అధిక క్యాలరీలు కలిగిన పదార్దాలకు దూరంగా ఉండాలి. కేకులు,ప్రేస్టిలు,స్వీట్స్ వంటి వాటిని పూర్తిగా మానివేయాలి. బంగాళదుంపలను తినటం బాగా తగ్గించాలి.

6. అయోడిన్,మెగ్నీషియం ఎక్కువగా ఉండే నట్స్ ను తరచుగా తీసుకోవాలి.

7. బియ్యానికి బదులుగా గోధుమలను తీసుకోవటం వలన ధైరాయిడ్ పనితీరు క్రమబద్దీకరణ చేయవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.