Kitchenvantalu

Avise ginjala Kaaram Podi: అవిసె గింజలతో ఇలా కారం పొడి చేసుకొని చూడండి, వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది

Avise ginjala Kaaram Podi: అవిసె గింజలతో ఇలా కారం పొడి చేసుకొని చూడండి, వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది..ఇలా చేస్తే పిల్లలు,పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు.

కావలసినవి :
అవిసె గింజలు – అరకప్పు
నూనె – 2 స్పూన్స్
కరివేపాకు – ఒక కప్పు
శనగపప్పు – అరకప్పు
మినపప్పు – 2 స్పూన్స్
ధనియాలు – 1 స్పూన్
జీలకర్ర – ఒక స్పూన్
ఎండుమిర్చి
వెల్లుల్లి – 8 రెబ్బలు
లవంగాలు – 4
ఇంగువ – చిటికెడు
తగినంత ఉప్పు .

తయారి విధానం
ముందుగా శనగ పప్పు ని నూనె లేక నెయ్యిలో 3-4 నిముషాలు పాటు తక్కువ మంట దగ్గర వేపాలి, దీనికి మినపప్పు,ధనియాలు,జీలకర్ర,ఎండు మిర్చి కలిపి దోరగ వేపాలి, తీసి పక్కనపెటాలి .అవిసె గింజలను కూడా తక్కువ మంట దగర వేపాలి, వేగిన తరువాత పక్కన పెటాలి .కరివేపాకు వేపాలి ,వీటిలో వెల్లుల్లి , లవంగాలు,ఇంగువ కలిపి మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి.