Kitchenvantalu

Onion Cutting Tips:కన్నీళ్ళు రాకుండా ఉల్లిపాయను కట్ చేయాలంటే….

Onion Cutting Tips:కన్నీళ్ళు రాకుండా ఉల్లిపాయను కట్ చేయాలంటే….ఇలా చేస్తే నో టియర్స్..ఉల్లిపాయలను ప్రతి రోజు వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ లేనిదే కూరకు రుచి రాదు. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఉల్లిపాయను కోసినప్పుడు కన్నీరు రావటం సహజమే.

ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉండుట వలన చాలా గాటుగా ఉంటుంది. ఉల్లిపాయను కోసినప్పుడు ఆ గాటు కారణంగా కన్నీరు వస్తుంది. అలాగే ఉల్లిపాయను కోసే కత్తి చాలా పదునుగా ఉండాలి.

ఉల్లిపాయను కోయటానికి ముందు చల్లని నీటిలో అరగంట సేపు ఉంచాలి.

ఉల్లిపాయ తొక్క తీసి.. ఫ్రీజర్‌లో అరగంట పాటు ఉంచిన తర్వాత కట్ చేస్తే కళ్లు మండవు, ఉల్లిపాయలను సులభంగా కోయవచ్చు.

ఉల్లిపాయను సగానికి కట్ చేసాక, ఒక నిమిషం పాటు పారే నీటి కింద ఉంచితే ఆ గాటు తగ్గుతుంది.

ఉల్లిపాయను కోసేటప్పుడు మీ నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకోవాలి. ఈ విధంగా చేయుట వలన గాటును తక్కువగా పిల్చే అవకాశం ఉంటుంది.

ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా సన్ గ్లాసెస్ వాడినా కళ్ల మంట తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.