Kitchenvantalu

Kitchen Tips and Tricks:నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు…

Kitchen Tips and Tricks:నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు…ప్రతి రోజు మనం ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సమయం ఆదా అవుతుంది.

Telugu Kitchen Tips: చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి.

బంగాళాదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.

ఎండిపోయిన పచ్చిమిరపకాయలు వృధాగా పారెయ్యకండి. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి దంచితే రుచికరమైన చట్నీ తయారవుతుంది.

వర్షాకాలంలో ఒకోసారి పెరుగు తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు ఆ పాలగిన్నె ఫ్రిజ్ stabilizer పై ఉంచితే పెరుగు త్వరగా తోడుకుంటుంది.

యాలకుల తొడిమెలు పారెయ్యకుండా దంచి టీలో వేస్తే టీ రుచిగా ఉంటుంది.

దోశ, ఇడ్లీ చేసేటప్పుడు నానబెట్టిన బియ్యం,పప్పులో కొంచెం మెంతులు వెయ్యాలి. ఇడ్లీ,దోశలు మెత్తగా ఉంటాయి.

సూప్ తయారు చేసేటప్పుడు కూరల్లో వెన్న కలిపితే సూప్ మరింత రుచిగా ఉంటుంది.

అరటిపండు ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే తొక్క నల్లబడకుండా పండు తాజాగా ఉంటుంది.

మామిడి ఊరగాయ చట్నీ ఎర్రగా కనిపించాలంటే తిరగమూతలో చిటకెడు బేకింగ్ సోడా కలపాలి.

కూరల ట్రేలో పేపర్ వేసి కూరగాయలు ఫ్రిజ్లో ఉంచితే తాజాగా ఉంటాయి.

ఎండు మిరపకాయల్లో ఉప్పు, మంచి నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.

వర్షాకాలంలో సోంపు గింజలు, గసగసాలు, నువ్వులు వేయించి ఉంచుకుంటే త్వరగా చెడిపోకుండా ఉంటాయి.