Kitchenvantalu

Kitchen Tips:ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు

Kitchen Tips and tricks In Telugu: ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు..వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా రుచిగా వస్తుంది. అంతేకాకుండా సమయం కూడా అదా అవుతుంది. అలాగే ఈ చిట్కాలను పాటించటం కూడా చాలా సులువు.

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది.

పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది.

పాపడ్లు మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది.

మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.

వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.

బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.

ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది.

దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.