Kitchenvantalu

Kitchen Hacks:మిక్సర్-గ్రైండర్‌పై చేరిన మురికి, మరకలు సులభంగా పోవాలంటే..ఇలా చేస్తే చాలు

Clean Mixer Grinder ::మిక్సర్-గ్రైండర్‌పై చేరిన మురికి, మరకలు సులభంగా పోవాలంటే..ఇలా చేస్తే చాలు.. మనం వంటింట్లో ప్రతి రోజు మిక్సీ వాడుతూ ఉంటాం. మిక్సీ గ్రైండర్, మిక్సీ జార్ లను చాలా సులభంగా శుభ్రం చేసుకోవడానికి మంచి చిట్కాలను తెలుసుకుందాం.

ఈ చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా మిక్సీ జార్ మరియు మిక్సీ గ్రైండర్ మీద మురికిని తొలగించుకోవచ్చు. ప్రతి రోజు మిక్సీ జార్, మిక్సీ గ్రైండర్ ని వాడటం వలన జిడ్డు, మురికి పేరుకుపోతుంది.

బేకింగ్ పౌడర్ వంటగదిలో వస్తువులను శుభ్రం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. బేకింగ్ పౌడర్ లో నీటిని పోసి పేస్ట్ గా చేసుకుని మిక్సర్ గ్రైండర్ పైన రాసి రెండు నిమిషాలు అయ్యాక నీటిని పోసి శుభ్రంగా కడిగితే మురికి,జిడ్డు అన్ని తొలగిపోతాయి . ఈ మిశ్రమం ఎంతటి కఠినమైన మరకలు, జిడ్డునైన తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మిక్సీ జార్లో ఈ పేస్ట్ ని కొంచెం వేసి నీటిని పోసి ఒకసారి మిక్సీ చేసి ఆపేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆ నీటిని తీసివేసి శుభ్రంగా తుడిస్తే మిక్సీలో ఏమైనా వాసనలు ఉంటే తొలగిపోతాయి.

వాషింగ్ పౌడర్ కూడా మిక్సర్ గ్రైండర్ ని శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. వాషింగ్ పౌడర్ నీటిలో కలిపి స్పాంజ్ సాయంతో మిక్సర్ గ్రైండర్ బాడీని స్క్రబ్ చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.