Kitchenvantalu

Summer Drink:వేసవి తాపాన్ని చిటికెలో తగ్గించే ఛట్ పటా లెమన్ పంచ్

Summer Drink:వేసవి తాపాన్ని చిటికెలో తగ్గించే ఛట్ పటా లెమన్ పంచ్…వేసవి కాలం వచ్చేసింది. ఎండలు బాగా పెరిగిపోయాయి. ఎండలో బయటకు వెళ్ళి వచ్చాక చల్లగా ఏదైనా త్రాగాలని అనిపిస్తుంది.

అలాంటి సమయంలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఇప్పుడు చెప్పే లెమన్ డ్రింక్ త్రాగితే వేసవి తాపం తగ్గటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు లెమన్ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో, అవసరమైన ఇంగ్రిడియన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. లెమన్ డ్రింక్ ని తయారుచేయటం కూడా చాలా సులువు.

పుదీనా
అల్లం
పంచదార
ఉప్పు
నిమ్మకాయలు

పుదీనా,అల్లం మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక గిన్నెలో వేసి మూడు గ్లాసుల నీటిని,నాలుగు స్పూన్ల పంచదార,పావు స్పూన్ ఉప్పు, రెండు నిమ్మకాయలు పిండి బాగా కలపాలి. అంతే చల్ల చల్లని లెమన్ డ్రింక్ రెడీ.

నిమ్మలో విటమిన్ సి ఉండుట వలన శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి అలసట, నిస్సత్తువను ధూరం చేస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపేస్తుంది. ఈ డ్రింక్ లో పుదీనా,అల్లం వేశాం కాబట్టి లెమన్ డ్రింక్ చాలా టేస్టీ గా ఉంటుంది.