Kitchenvantalu

Rice Cutlet :మిగిలిన అన్నంతో రైస్ కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదుర్స్

Rice Cutlet :మిగిలిన అన్నంతో రైస్ కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదుర్స్..పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటారు. ఎప్పుడూ అన్నం తినేవారు.. దీనితో కొత్త టేస్ట్ చూడొచ్చు.

కావాల్సిన పదార్ధాలు
అన్నం 1 కప్పు,టమాటా రసం అరకప్పు,వెన్న -1 స్పూన్,అల్లం చిన్న ముక్క,చీజ్ 50 గ్రాములు,బ్రెడ్ పొడి -1, ఉప్పు,మిరియాలపొడి అర స్పూన్,నూనె వేయించడానికి సరిపడా,ఉప్పు తగినంత

తయారు చేయు విధానం
బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, బెల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి.సగం నీళ్లు ఇంకి పోయాక టమోటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి.తర్వాత అందులోనే చీజ్ వేసి పొయ్యి కట్టేయ్యాలి.

చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా(కట్లెట్ ఆకారంలో) చేసి నూనెలో వేయించుకోవాలి.వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."