Healthhealth tips in telugu

బ్లూ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు మిస్ కావద్దు

Blue Tea Benefits:బ్లూ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు మిస్ కావద్దు.. మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే శంఖుపూలతో తయారుచేసిన టీ తాగాలి. శంఖుపూలను ఎక్కువగా శివుని ఆరాధనలో వాడతారు.ఈ పూలతో తయారు చేసిన టీని బ్లూ టీ అని పిలుస్తారు. ఈ టీని ప్రతి రోజు పరగడుపున తాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.

అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

అయితే ఈ టీని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక 6 శంఖు పువ్వులు, 1 అంగుళం అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.