Healthhealth tips in telugu

Weight Loss Tips:ఈ ఆహారాలను తింటే బాన పొట్ట 30 రోజుల్లో మాయం అవుతుంది.. తెలుసా

Weight Loss Tips:ఈ ఆహారాలను తింటే బాన పొట్ట 30 రోజుల్లో మాయం అవుతుంది.. తెలుసా..ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది వ్యాయామం చేయక పోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, థైరాయిడ్ సమస్య ఉండటం ఇలా అనేక కారణాలతో చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య నుంచి త్వరగా బయట పడటానికి ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది.

ఓట్స్ అనేవి శరీరంలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఓట్స్ లో వుండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. రోజులో ఒక కప్పు ఓట్స్ ఉడికించి తింటే సరిపోతుంది. ఓట్స్ అనేవి బరువును తగ్గించటానికి ప్రసిద్ది చెందినవి.

పియర్స్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్, సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో కొవ్వు నిల్వ లేకుండా చేస్తాయి దాంతో బరువు తగ్గుతారు. పియర్స్ ని మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే మంచిది.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగితే అధిక బరువు, శరీరంలో అదనంగా వున్న కొవ్వు కరిగిపోతుంది. నిమ్మలో ఉండే లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తాయి. అలాగే ఆకలి లేకుండా చేస్తుంది.

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక బరువును తగ్గిస్తాయి. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కొవ్వు కరగటానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

టమాటాలలో విటమిన్లు, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.

చాలామంది పచ్చిమిరపకాయల కారంగా ఉంటాయని తినరు. కానీ పచ్చిమిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News