Kitchenvantalu

Kitchen Tips:చాకు తుప్పు లేకుండా పదును బావుండాలంటే..ఈ ఈజీ పద్దతుల్ని ట్రై చేయండి.. !

Kitchen Tips:చాకు తుప్పు లేకుండా పదును బావుండాలంటే..ఈ ఈజీ పద్దతుల్ని ట్రై చేయండి.. వంటింట్లో మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనది కత్తి. కత్తి లేకపోతే వంట గదిలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

వంట గదిలో ఎక్కువగా కత్తిని వాడటం వలన తుప్పుపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనలో చాలా మంది కత్తి తుప్పు పట్టిన తర్వాత శుభ్రం చేయటానికి మార్కెట్ కి తీసుకు వెళ్తూ ఉంటారు.

తుప్పు తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. తుప్పు పట్టిన కత్తిని నీటితో తడిపి దానిపై కొంచెం బేకింగ్ సోడా వేసి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్ తో రుద్దితే కత్తి శుభ్రం అవుతుంది.

వంటగదిలో రెగ్యులర్ గా ఉపయోగించే వెనిగర్ కూడా కత్తి మీద తుప్పును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక మగ్గులో నీటిని పోసి దానిలో మూడు స్పూన్ల వెనిగర్ వేసి దానిలో తుప్పు పట్టిన కత్తిని ముంచి పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత కత్తిని తీసి శుభ్రం చేస్తే సరిపోతుంది.

తుప్పును తొలగించటానికి ఉల్లిపాయ రసం కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయను కోసి దాని రసాన్ని కత్తిపై బాగా రాసి కొంచెం సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కత్తిని శుభ్రం చేయండి. కత్తిపై ఉన్న తుప్పు సులభంగా తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.