Beauty TipsKitchenvantalu

Coconut Husk Fiber: కొబ్బరి పీచును పాడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే..అసలు వదిలిపెట్టరు

Coconut Husk Fiber: కొబ్బరి పీచును పాడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే..అసలు వదిలిపెట్టరు..కొబ్బరి పీచును ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొబ్బరి పీచును బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాల్లో ఔషదంగా వాడతారు. డయేరియా, అతిసారం,జీర్ణ సమస్యలకు ఔషదంగా వాడతారు.

కొబ్బరి పీచును బాగా శుభ్రం చేసి.. నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా తాగితే డయేరియా, అతిసారం,జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ నీటిని తాగితే ఉపసమనం కలుగుతుంది. కొబ్బరి పొట్టులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చలికాలంలో కీళ్ళనొప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది.

పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మారుస్తుంది. ఒక బాణలిలో కొబ్బరిపీచు వేసి మీడియం మంట మీద వేయించాలి. నల్లగా మారిన తర్వాత మంటను ఆపివేయండి. దీనిని పొడిగా చేసి దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే మీ దంతాలు ముత్యాల్లా తెల్లగా మారుతాయి.

కొబ్బరి పీచు వంటగదిలో పాత్రలను శుభ్రం చేయటానికి ఉపయోగించవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న కొబ్బరి పీచును పాడేయకుండా వాడటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.