Kitchenvantalu

Onion Chutney:ఇంట్లో కూరగాయలు లేనప్పుడు రెండు ఉల్లిపాయలతో కమ్మగా ఇలా పచ్చడి చేసుకోండి

Onion Chutney:ఇంట్లో కూరగాయలు లేనప్పుడు రెండు ఉల్లిపాయలతో కమ్మగా ఇలా పచ్చడి చేసుకోండి..రుచి చాలా బాగుంటుంది. ఒక సారి చేస్తే అసలు వదిలి పెట్టరు.

కావలసిన పదార్ధాలు
పచ్చిమిర్చి ముక్కలు – ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
చింతపండు – చిన్న నిమ్మకాయ సైజులో
జీలకర్ర – అర చెంచా
వెల్లుల్లి రెబ్బలు – 5-6
మెంతులు – పావు చెంచా
పసుపు – పావు చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 5-6 చెంచాలు

తయారీ విధానం:
ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకుని నూనె వేసి కాస్త వేడి అయ్యాక అందులో జీలకర్ర, మెంతులు వేసుకుని మాడిపోకుండా కొంచెం వేగించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేగించాలి.

ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి.కాసేపయ్యక పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి.పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషంపాటు కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇది మిక్సీ లో కంటే రోట్లో రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది.ఇష్టమైతే ఇందులో పోపు వేసుకోవచ్చు. పోపు లేకుండనైనా బాగుంటుంది.ఇది అన్నంలో, రొట్టెలో, చపాతీలో చాలా బాగుంటుంది.