Kitchenvantalu

Soya Chunks Biryani:మీల్ మేకర్ బిర్యానీ ఇలా చేస్తే గ్రేవీ చేయాల్సిన పని లేదు

Soya Chunks Biryani:మీల్ మేకర్ బిర్యానీ ఇలా చేస్తే గ్రేవీ చేయాల్సిన పని లేదు..లంచ్ బాక్స్ లోకి చిటికెలో చేసుకోవచ్చు. రోజు ఒకేలా కాకుండా మిల్మేకర్ తో ఇలా వెరైటీగా చేసుకోండి.

కావలసిన పదార్ధాలు
మిల్ మేకర్ – అర కప్పు
పెరుగు – పావు కప్పు
బియ్యం – ఒక కప్పు
ఉప్పు – తగినంత
కారం – మూడు చెంచాలు
పసుపు – చెంచా
ధనియాల పొడి – ఒక చెంచా
గరం మసాలా – ఒక చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక చెంచా
నూనె – 3-4 చెంచాలు
పచ్చిమిర్చి – 4
ఉల్లిపాయ – ఒకటి
యాలకులు – 3
లవంగాలు – 3
బిర్యానీ ఆకులు – 2
దాల్చిన చెక్క – ఒకటి
టమాటా – ఒకటి
కొత్తిమీర – అర కప్పు
నీళ్లు – కవలసినన్ని

తయారీ విధానం:
మిల్ మేకర్ ని వేడి నీటిలో తడిపి నీళ్లు పోయేలా పిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.మిల్ మేకర్ లో పెరుగు, ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి బాగా కలుపు కోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసి వేడయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి.

ఇందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి.ఇవి కొంచెం వేగిన తరవాత టమాటా ముక్కలు వేసి కలుపుకుని, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచా కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని కలుపుకోవాలి.ఒక నిమిషం తరవాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని వేసి, ధనియాలపొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకుని మూతపెట్టుకోవాలి.

రెండు నిముషాల తరవాత కడిగిన బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకుని, ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి.మధ్యలో ఒకసారి కలుపుకుని అందులో కొత్తిమీర తరుగు వేసుకుని మూత పెట్టుకోవాలి.అన్నం మగ్గిన తరవాత చూసుకుని స్టవ్ ఆపేసుకుని వేడిగా వడ్డించుకోవడమే.