Kitchenvantalu

Bobbarlu Vadalu Recipe:బొబ్బర్ల వడలు ఒకసారి తిని చూడండి..చాలా రుచిగా ఉంటాయి

Bobbarlu Vadalu Recipe:బొబ్బర్ల వడలు ఒకసారి తిని చూడండి..చాలా రుచిగా ఉంటాయి.. బొబ్బర్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో వడలు తయారుచేసుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు.. లేదంటే సాయంత్రం స్నాక్ గా తినవచ్చు.

కావాల్సిన పదార్ధాలు
బొబ్బర్లు ఒక కప్పు
అల్లం ఒక అంగుళం
పచ్చిమిర్చి రెండు
పసుపు అర టీ స్పూన్
కొత్తిమీర ఒక టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె మూడు వందల మీ. లి .

తయారీ విధానం
బొబ్బర్లను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని పసుపు , అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర , ఉప్పు, వేసి ముద్దలా చేసుకోవాలి.మూకుడులో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక పైన తయారుచేసుకున్న ముద్దను చిన్న చిన్న వడలుగా చేసుకొని నూనెలో గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. అంతే వేడివేడిగా బొబ్బర్ల వడలు రెడీ.