Kitchenvantalu

Ajwain Rasam:వాము రసం ఇలా చేసి పెట్టండి.. అజీర్తి, కడుపు నొప్పి చిటికెలో మాయం..

Ajwain Rasam:వాము రసం ఇలా చేసి పెట్టండి.. అజీర్తి, కడుపు నొప్పి చిటికెలో మాయం..వాములో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కడుపుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు: వాము – 1 టీ స్పూను, ఎండుమిర్చి – 4, ధనియాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చిమర్చి – 2, చింతపండు రసం – 250 మి.లీ., పసుపు – అర టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – 4 రెబ్బలు.

తయారి విధానం
ముందుగా బాణలి పెట్టి ఒక స్పూన్ వాము, రెండు ఎండు మిర్చి, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర నూనె లేకుండా వేగించి పొడి చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, రెండు వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగించే చింతపండు రసం పోయాలి.

కొంచెం మరిగాక పసుపు సరిపడా ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించాలి ఆ తర్వాత వాము పొడిని కలిపి రెండు నిమిషాలు మరిగించి దించేస్తే వాము చారు రెడీ. ఈ రసంను రెండు రోజులు తింటే అజీర్ణం,కడుపు నొప్పి సమస్యలు తొలగిపోతాయి.