Kitchenvantalu

Bread Kofta Curry Recipe:రెస్టారెంట్ల‌లో ల‌భించే బ్రెడ్ కోఫ్తా క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Bread Kofta Curry Recipe:రెస్టారెంట్ల‌లో ల‌భించే బ్రెడ్ కోఫ్తా క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!..మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, క్యాట‌రింగ్ లో ల‌భించే వివిధ ర‌కాల వంట‌కాల్లో బ్రెడ్ కోఫ్తా క‌ర్రీ కూడా ఒక‌టి.

కావలసిన పదార్దాలు
బ్రెడ్ స్లైసెస్ : ఆరు
క్యాబేజి, క్యారెట్ తురుము : కప్పున్నర
బంగాళదుంపలు : నాలుగు
ఉల్లికాడలు తరుగు : 2 స్పూన్స్
పచ్చిమిర్చి : 3
ఉల్లిపాయలు : 2
సోయా సాస్ : 1 స్పూన్
టమాట సాస్ :1 స్పూన్
వెల్లుల్లి రేకలు : 7
నూనె :సరిపడా
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం
ముందుగా బంగాళాదుంపలను ఉడకబెట్టి,తొక్క తీసి చిదిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం నూనె పోసి దానిలో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,క్యారెట్ తురుము,క్యాబేజి తురుము,చిదిమిన బంగాళాదుంప,ఉప్పు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారక ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు బ్రెడ్ యొక్క అంచులను కట్ చేసి,వాటిని నీటిలో ముంచి వెంటనే తీసివేయాలి. ఆ తర్వాత నీటిలో నుంచి తీసిన ఈ బ్రెడ్ స్లైసెస్ ను రెండు అరచేతుల మధ్య పెట్టి పిండాలి. ఆ తర్వాత ఒక్కో స్లైసెస్ తీసుకోని మధ్యలో పైన తయారుచేసుకున్న ఉండను పెట్టి చుట్టూ మూయాలి. బాణలిలో నూనె పోసి వేడి చేసి బ్రెడ్ బాల్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

తర్వాత మందపాటి గిన్నెలో 3 స్పూన్స్ నూనె వేసి వెల్లుల్లి ముక్కలు,ఉల్లికాడ ముక్కలు,సోయా సాస్, టమోట సాస్ వేసి కొంచెం వేగాక బ్రెడ్ బాల్స్ వేసి ఐదు నిముషాలు ఉంచి దించితే బ్రెడ్ కోప్తా కర్రీ రెడీ.